పుట్టపర్తి టౌన్: నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య తెలిపారు. సోమవారం పుట్టపర్తిలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన నేర సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నాటుసారా, నవోదయం, అక్రమ మద్యం రవాణాపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నాటుసారా తయారీదారులు, విక్రయ దారులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. నవోదయం 2.0లో భాగంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. పన్ను చెల్లించని మద్యం అమ్మకం దారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్లు దుకాణాల్లో కల్తీ జరగకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్
నాగముద్దయ్య


