టిప్పర్, బైకు ఢీ.. యువకుడి దుర్మరణం
పావగడ: టిప్పర్, బైకు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన పావగడ సమీపంలో జరిగింది. వివరాలు.. పావగడ లోని కన్మాన్ చెరువు ప్రాంతానికి చెందిన వడ్డెర ఈరదాసప్ప, నాగమ్మ దంపతుల కుమారుడు అంబరీశ్ (25) శనివారం తన స్నేహితుడు భాస్కర్‌తో కలిసి బైకుపై మధుగిరి వైపు వెళ్తుండగా రాజవంతి సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఎదురుగా టిప్పర్ ఢీకొంది. ఈ క్రమంలో తీవ్రగాయాలైన అంబరీశ్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను స్థానికులు తుమకూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు నాగమ్మ, ఈరదాసప్ప గుండెలవిసేలా రోదించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆగ్రహించిన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు స్పందించి కేసు నమోదు చేయడంతో ఆందోళన విరమించారు.
టిప్పర్, బైకు ఢీ.. యువకుడి దుర్మరణం


