రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

Jan 18 2026 7:09 AM | Updated on Jan 18 2026 7:09 AM

రాష్ట

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

పుట్టపర్తి టౌన్‌: ‘‘ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. పిన్నెల్లిలో మందా సాల్మన్‌ హత్య కూడా ప్రభుత్వ హత్యే. సాల్మన్‌ కుటుంబాన్ని వెలివేసిన టీడీపీ నేతలు ఆయన గ్రామంలో కనిపించగానే రాడ్లతో కొట్టి చంపారు. హత్యలో పాల్గొన్న టీడీపీ నేతలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతోపాటు సాల్మన్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి’’ అని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్‌ హత్యకు నిరసనగా శనివారం వైఎస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో కొత్తచెరువులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. దళితులకు పూర్తిగా రక్షణ కరువైందన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీసీ కార్యకర్త మందా సాల్మన్‌ను కొంతమంది టీడీపీ గూండాలు ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఆరు రోజుల పాటు చికిత్స పొంది గురువారం మృతి చెందారన్నారు. ఈ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి..

దళితురాలైన అనిత హోంమంత్రిగా ఉన్న సమయంలోనే దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెచ్చుమీరాయని ఎస్సీసెల్‌ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు అరికట్టలేని హోంమంత్రి అనిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సాల్మన్‌ కుటుంబానికి పరిహారం ఇవ్వడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పిన్నెల్లి గ్రామాన్ని విడిచి వెళ్లిన దళిత కుటుంబాలకు వెంటనే రప్పించాలి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు అంజినప్ప, చౌడప్ప, ఎస్టీడీ నరసింహులు, రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి ఫొటో సాయి, ఎస్సీ సెల్‌ నాయకులు గంగిశెట్టి, నారాయణస్వామి, అలూమూరు ఓబిలేసు, అజంత కృష్ట, రామయ్య, నాగరాజు, సూరి, నరసింహులు, సర్పంచ్‌లు నాగరాజు, దామోదర్‌, శివ, బండ్లపల్లి నరసింహులు, రామాంజనేయులు, ఏలేశ్వర్‌, శంకరప్ప పాల్గొన్నారు.

సర్కార్‌ ప్రోద్బలంతోనే

మందా సాల్మన్‌ హత్య

సాల్మన్‌ను కొట్టిచంపిన టీడీపీ

గూండాలను వెంటనే అరెస్ట్‌ చేయాలి

కొత్తచెరువు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ ధర్నా

సాల్మన్‌ హంతకులను

కఠినంగా శిక్షించాలి

ఉషశ్రీ చరణ్‌ డిమాండ్‌

పెనుకొండ రూరల్‌: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మందా సాల్మన్‌ను హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు డిమాండ్‌ చేశారు. మందా సాల్మన్‌ హత్యను నిరసిస్తూ శనివారం ఆమె పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మందా సాల్మన్‌పై పచ్చ గూండాలు పాశవికంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారన్నారు. సాల్మన్‌ హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు 1
1/1

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement