రైతుకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులు సుభిక్షంగా ఉండాలని మా హయాంలో 193 చెరువులు నింపే కార్యక్రమానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించింది. అయినా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైతుల పక్షాన మాట్లాడే సహసం చేయడం లేదు. ఇక అన్నదాత సుఖీభవ, పావలావడ్డీ, క్రాప్ ఇన్సూరెన్స్, నాణ్యమైన విత్తనాలు ఆర్‌బీకేల్లో అందజేసే కార్యక్రమాలకు ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడి రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే మేల్కొని చంద్రబాబును ఒప్పించి 193 చెరువులు నింపేలా చూడాలి.
– దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే పుట్టపర్తి


