మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
ఎన్‌పీకుంట: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నేతృత్వంలోని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.సతీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మండల పరిధిలోని పెడబల్లి గ్రామంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులరెడ్డి, నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన మహిళలు హారతులు పట్టారు. అనంతరం స్థానిక నాయకుడు, పారిశ్రామికవేత్త ఎం.హరీష్‌రెడ్డి నివాసంలో సతీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మోసం చంద్రబాబు నైజమన్నారు. అబద్ధాల పునాదులపై నిలబడిన చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న రోజులలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు టి.జగదీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొత్తరంగారెడ్డి, వైస్ ఎంపీపీ కేశవరెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, ఉప సర్పంచులు రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి దుద్దుకుంట వెంకటరెడ్డి, కార్యదర్శి రామచంద్ర, నాయకులు తిరుమలనాయుడు, షామీర్‌బాషా, మాధవరెడ్డి, వెంకటరామిరెడ్డి, అంజన్‌రెడ్డి, రంగా రెడ్డి, అల్లాభక్షు, రాఘవయ్య, శివారెడ్డి, ఖాదర్‌బాషా, కలాంబాషా, చెన్నకృష్ణారెడ్డి, స్వామిరెడ్డి, శివయ్య, నాగార్జున, విశ్వనాథ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పిలుపు


