ముత్తుకూరు: అరాచకవాదులను పంచాయతీ ఎన్నికల్లో తరిమికొట్టి.. మంచిని గెలిపించుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ముత్తుకూరు పంచాయతీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ముత్తుకూరు అభివృద్ధి చెందాలంటే, ఈదూరు రామ్‌ప్రసాద్‌రెడ్డికి ఓటేయాలని కోరారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారని, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ఇదే విషయం అర్థమవుతోందని చెప్పారు. గెలిచిన వారిని ఓడించి.. ఓడిన వారిని గెలిపించారని ఆరోపించారు. కళ్లు నెత్తికెక్కి కొందరు ప్రవర్తిస్తున్నారని, వీరికి తగిన విధంగా ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తన తండ్రి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హయాంలోనే ముత్తుకూరులో అభివృద్ధి, సంక్షేమం కొత్త పుంతలు తొక్కాయని చెప్పారు. అభ్యర్థి ఈదూరు రామ్‌ప్రసాద్‌రెడ్డి, నేతలు అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుగుణ, శ్రీనివాస్‌రెడ్డి, రామయ్య, నవీద్‌బాషా, సురేష్, సూరి, అక్కయ్య, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.


