నెల్లూరు(పొగతోట): నిబంధనలను పాటించకుండా, రిజిస్ట్రేషన్లు లేకుండా బియ్యం వ్యాపారా లు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని విజి లెన్స్, సివిల్ సప్లయ్స్ అధికారులు హెచ్చరించా రు. స్టోన్‌హౌస్‌పేటలోని రేబాలవీధిలో గల గౌత మ్ ట్రేడర్స్‌లో తనిఖీలను అధికారులు శనివారం నిర్వహించారు. ఎలాంటి రికార్డులు, రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారనే అంశాన్ని కనుగొన్నారు. రూ.4.43 లక్షల విలువజేసే 385 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఏఎస్‌ఓ పుల్లయ్య, తహసీల్దార్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


