వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా కుంచల | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా కుంచల

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన కుంచల సవీంద్రరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.

స్వతంత్ర అభ్యర్థి కారుపై టీడీపీ నేత దాడి

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని పంచేడు గ్రామంలో టీడీపీ నేత హల్‌చల్‌ చేశాడు. ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పెనాక సుజాతమ్మపై స్థానిక టీడీపీ నాయకుడు బలరాంరెడ్డి శనివారం దౌర్జన్యానికి దిగాడు. బండరాళ్లతో ఆమె కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ దాడికి పాల్పడింది తన భర్తే అని, కొన్నేళ్లుగా ఆయన వేధింపులు భరించలేక దూరంగా ఉంటున్నానన్నారు. ఇప్పటికే విడాకుల కోసం న్యాయపరమైన నోటీసులు కూడా పంపినట్లు వివరించారు. ప్రస్తుతం తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడాన్ని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వాపోయారు. బలరాంరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఎన్నికలాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

వెంకటాచలం: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వస్తువులు కాలిపోయి రూ.2 లక్షల ఆస్తి నష్టం కలిగిన ఘటన మండలంలోని కసుమూరు పంచాయతీ చింతలపాళెంలో శనివారం జరిగింది. చింతలపాళెం గ్రామానికి చెందిన నలబాలపు చలపతి నివాసంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీరువాలో దాచిన రూ.70 వేల నగదు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు అంతా కలిపి రూ.2 లక్షల నష్టం జరిగిందని బాధితుడు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి నీటి మోటార్లతో మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement