కాటంరెడ్డి కృష్ణారెడ్డికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

కాటంరెడ్డి కృష్ణారెడ్డికి ఘన నివాళి

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

కోవూరు: కోవూరు ప్రభుత్వ వైద్యశాల స్థల దాత, కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణ దాత, చైర్మన్‌ కాటంరెడ్డి కృష్ణారెడ్డికి పలువురు శనివారం ఘనంగా నివాళులర్పించారు. కోవూరులోని ఆయన నివాసంలో భౌతికకాయానికి జిల్లాలోని ప్రముఖులు పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం, దేవాలయాల అభివృద్ధికి తోడ్పడడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం వంటి కార్యక్రమాలతో ఆయనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఆనం విజయకుమార్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement