● వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వెంకటాచలం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందిన ఘటన వెంకటాచలంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు మృతదేహం మీదుగా వెళ్లడంతో నుజ్జునుజ్జు అయిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పక్కకు లాగించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి మెడలో
సరుడు దోపిడీ
నెల్లూరు(క్రైమ్): గుడి నుంచి ఇంటికెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు సరుడును గుర్తుతెలియని దుండగులు తెంపుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. నిప్పో సమీప సావిత్రినగర్ నాలుగో వీధిలో వెంకటశేషమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె ఈనెల 26వ తేదీన నిప్పో సెంటర్లోని సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఇంటికి బయలుదేరారు. ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఐదు సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లారు. వృద్ధురాలు పెద్దగా కేకలు వేసేసరికే దుండగులు బైక్ వేగం పెంచి పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు శనివారం తెలిపారు.
నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.75
సన్నవి: రూ.40
పండ్లు: రూ.15


