ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ టీచర్‌

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ప్రభుత్వ టీచర్‌ పంచాయతీ ఎన్నికల్లో తలదూర్చి టీడీపీ మద్దతు అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం శనివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన చెన్నూరు శ్రీనివాసులురెడ్డి వడ్డిపాళెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇదే పాఠశాలలో వెంకట రమణయ్య అనే మరో ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు ఎన్నికల విధులు ఉండడంతో పాఠశాలలో శ్రీనివాసులురెడ్డి ఒక్కడే బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయన పాతదేవరాయపల్లికి వెళ్లి పలు కూడళ్ల వద్ద ఓటర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం మద్దతు అభ్యర్థికి ఓట్లు వేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా అతను తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆడుకుంటుండగా కొందరు యువకులు వెళ్లి విద్యార్థులను ఆరాతీశారు. భోజన సమయంలో ఇంటికెళ్లిన టీచర్‌ ఇంకారాలేదని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement