కావలి: కావలి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీచేసిన ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన్ను శనివారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు కావలి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


