దుర్గం అడవిలో పురాతన శివలింగం | - | Sakshi
Sakshi News home page

దుర్గం అడవిలో పురాతన శివలింగం

Nov 25 2026 12:14 AM | Updated on Nov 25 2026 12:14 AM

ఉదయగిరి రూరల్‌: ఉదయగిరి పట్టణ సమీపంలోని దుర్గం అటవీ ప్రాంతంలో పురాతన శివలింగం బయటపడింది. రాజుల కాలం నాటిదిగా భావిస్తున్న ఈ శివలింగాన్ని ఇటీవల స్థానికులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి వెళ్లిన జీవాల కాపరులు గుర్తించి, తాత్కాలికంగా పందిరి ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో 365 దేవాలయాలు, కోనేరులు ఉండేవని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దుర్గం అటవీ ప్రాంతంలో పురాతన శివలింగం బయటపడటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం శివమాలధారులు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

సమాజ నిర్మాణంలో

ఇంజినీర్ల పాత్ర కీలకం

వెంకటాచలం: సమాజ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మంగళవారం నిపుణుల ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇంజినీర్ల సేవలకు సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఇతర రంగాలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పలువురు నిపుణులు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో వీఎస్‌యూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ విజయ తదితరులు పాల్గొన్నారు.

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

● రోడ్డు సక్రమంగా లేక అదుపుతప్పి..

● ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

చిల్లకూరు: గూడూరు మండలం విందూరు గ్రామ సమీపంలో మంగళవారం ఓ స్కూల్‌ బస్సు అదుపు తప్పింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన మినీ బస్సు విందూరుతోపాటుగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుంది. గూడూరుకు వస్తున్న సమయంలో విందూరు సమీపంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బస్సు అదుపు తప్పడంతో కొంత దూరం జారి పోయింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కండలేరులో

16.530 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 16.530 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 65, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement