వైఎస్సార్‌సీపీలో జనసేన నేతల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో జనసేన నేతల చేరిక

Nov 25 2026 12:14 AM | Updated on Nov 25 2026 12:14 AM

కావలి: కావలిలో జనసేన 3వ వార్డు ఇన్‌చార్జి పసుపులేటి ప్రవీణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని వివరించారు. దీంతో ప్రతాప్‌కుమార్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకపోవడంతో ఆ పార్టీపై విరక్తి కలిగిందన్నారు. రామిరెడ్డి నాయకత్వ పటిమను గుర్తించి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement