చేజర్ల మండలం వావిలేరు గ్రామంలోని సర్వే నంబర్ 188/6లో మునగాల లక్ష్మీశైలజ వద్ద 0.62 సెంట్ల పట్టా పొలం కొనుగోలు చేసి కుమార్తె అజీజున్నీసా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. అయితే ఆమె 2011లో మృతి చెందింది. అప్పటి నుంచి పొలంలో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు. గ్రామానికి చెందిన చిల్లంకూరు నాగార్జున, స్వాతి, సులోచనలు నా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారిని హెచ్చరించినా.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. జామాయిల్ చెట్లను విక్రయించగా.. వాటిని కూలీలతో కొట్టించేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డుకున్నారు.
– షేక్ అమీర్‌బాషా,
అక్కంపేట, మనుబోలు మండలం


