● మండల స్థాయిలో
పరిష్కారం కాని సమస్యలు
● కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై మండలస్థాయి అధికారులకు ఎన్నోసార్లు అర్జీలిచ్చాం. అయినా పరిష్కారం కాలేదు. అందుకే వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చాం. మీరైనా ఆలకించి పరిష్కరించండి’ అంటూ పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్, డీఆర్వో విజయకుమార్, డీసీఓ గుర్రప్ప, మెప్మా, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు కిరణ్‌కుమార్, నాగరాజకుమారి, శ్రీనివాసప్రసాద్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


