సమగ్ర విచారణ ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

సమగ్ర విచారణ ఎప్పుడో..?

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

నిధుల స్వాహాలో సైట్‌

ఇంజినీర్లపై చర్యలేవీ..?

పూర్తి ఎంకై ్వరీ జరిగితే వెలుగులోకి తిమింగలాలు

ఉదయగిరి: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరిపై వేటుపడగా, మిగిలిన వారిపై చర్యల్లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అన్ని పనులను సమగ్రంగా పరిశీలిస్తే, రూ.కోట్ల ప్రభుత్వ నిధులను దిగమింగిన తిమింగలాల బాగోతం బట్టబయలయ్యే అవకాశముంది. ఇందులో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సైట్‌ ఇంజినీర్లు.. లేని పనులకు రికార్డులను తయారు చేసి ఫండ్స్‌ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పలు చోట్ల వెలుగులోకి

ఈ అవినీతి బాగోతం ఇప్పటికే పలు మండలాల్లో వెలుగులోకి వచ్చింది. ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, దగదర్తి, కొడవలూరు, కోవూరు, నెల్లూరు రూరల్‌ తదితర మండలాల్లో జరిగిన వర్కుల్లో అక్రమాల అంశాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో సైట్‌ ఇంజినీర్లుగా పనిచేసిన బలరామ్‌, కృష్ణారెడ్డి, అహ్మద్‌బాషా, ప్రవీణ్‌కుమార్‌, రవీంద్ర, మల్లేశ్వరి ప్రమేయముందనే ప్రచారం జరుగుతోంది.

తీగలాగితే కదిలిన డొంక

సమగ్ర శిక్షలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా లోతుకెళ్లి కొద్దీ అవినీతి వెలుగుచూస్తోంది. వింజమూరు మండలం నల్లగొండ్ల, శంఖవరం మండల ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీలను నిర్మించకుండానే నిధులను పక్కదారి పట్టించిన వైనంపై కథనాలను సాక్షి ప్రచురించింది. ఆ తర్వాత పలు మండలాల్లో ఇదే అంశాలు బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే సమగ్ర శిక్షలో స్పిల్‌ ఓవర్‌ పనుల్లో అక్రమాలు వెల్లడయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ పేరుతో నిధులను భక్షించిన వైనంపై కథనాలను ప్రచురించారు.

ప్రవీణ్‌కుమార్‌పై యాక్షనేదీ..?

సమగ్ర శిక్షలో కోవూరులో సైట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ పనులు చేయకుండానే బిల్లులను స్వాహా చేసే యత్నంలో తనకు సహకరించని ఉన్నత స్థాయి అధికారిపై చేయి చేసుకున్న ఉదంతంపై విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు పీఆర్‌ ఎస్‌ఈ పంపారు. దీని ఆధారంగా సదరు వ్యక్తిపై చర్యలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్‌ కాపీని కలెక్టర్‌ నుంచి తీసుకొని ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వకుండా ఏపీసీ మూడు నెలలు జాప్యం చేశారనే విషయం తాజాగా వెలుగుచూసింది.

ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ కేంద్రంగా జరిగిన పనుల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురు ఆధికారులపై ఆ శాఖ రాష్ట్ర పీడీ శ్రీనివాసరావు కొరడా ఝళిపించారు. పనులు చేయకుండానే నిధులను స్వాహా చేయడం, పలు పనులకు ఫేక్‌ ఐడీలను సృష్టించడం తదితరాలపై ’తిలాపాపం.. తలా పిడికెడు’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల ఏడున ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న సమగ్ర శిక్ష అధికారి వెంకటసుబ్బయ్యను తక్షణమే మాతృ సంస్థకు సరెండర్‌ చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీసీగా ఏఫ్‌ఏసీ బాధ్యతలను డీఈఓ బాలజీరావుకు అప్పగించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ను తక్షణమే మాతృ సంస్థకు బదిలీ చేశారు. టీసీఎస్‌ తరఫున విధులు నిర్వర్తిస్తూ అక్రమాలకు పాల్పడిన నేతాజీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ క్రిమినల్‌ చర్యలకు సిఫార్సు చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రతి పనినీ పరిశీలించి, తేడాలను గుర్తించి ప్రమేయమున్న వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement