గూడూరు: క్యూలో నిలవలేక అవస్థ
ఆత్మకూరులోని పోస్టాఫీస్ వద్ద ఇలా..
తల్లికి వందనం పేరిట మాతృమూర్తుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని డ్రా చేసే వారు కొందరైతే.. అసలు డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మహిళలు గురువారం బారులుదీరారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నగదు ఉపసంహరణకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎండ తీవ్రత తట్టుకోలేక పలువురు ఇబ్బంది పడ్డారు. – ఆత్మకూరు / గూడూరు


