నెల్లూరు(అర్బన్): జిల్లాలో 99.41 శాతం పల్స్‌పోలియో నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,67,750 మంది చిన్నారులుండగా తొలిరోజు ఆదివారం 2,54,510 మందికి పల్స్‌పోలియో చుక్కలను వేసి 95.05 శాతం లక్ష్యాన్ని సాధించారు. రెండో రోజు సోమవారం ఇంటింటి సర్వే ద్వారా మరో 12,045 మందికి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలను వేసి మరో 4.99శాతం నమోదు చేశారు. రెండు రోజులకు కలిపి 2,66,180 మందికి చుక్కలు వేసి 99.41శాతం ప్రగతి సాధించారు. మంగళ వారం కూడా ఇంటింటి సర్వే కొనసాగించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు.
7 నుంచి విద్యుత్
ఉద్యోగుల క్రీడా పోటీలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ట్రాన్స్‌కో వారి ఉత్తర్వుల మేరకు 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ సర్కిల్ క్యారమ్స్, చెస్, బాల్‌బ్యాడ్మి ంటన్ పోటీలను జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నెల్లూరుక్లబ్‌లో నిరహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ నెల్లూరు స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి విద్యుత్ ఉద్యోగుల ఎంపికలను జూలై 1న విద్యుత్ భవన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పా రు. ఆసక్తి కలిగిన విద్యుత్ ఉద్యోగులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 90308 02038, 98660 70775, 995129 4829, 9848714330 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రేపట్నుంచి సోమశిలలో
చేపల వేట నిషేధం
సోమశిల: సోమశిల జలాశయంలో జూలై 1 నుంచి రెండు నెలల పాటు చేపల వేటను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎఫ్‌డీఓ సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో స్థానిక జాలర్లు, చేపల వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ మాట్లాడుతూ చేపలు గడ్లు పెట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయంలో చేపల వేటను నిషేధించినట్లు తెలిపారు. నిషేధ కాలంలో జలాశయ పరిసర ప్రాంతాల్లో వలలతో సంచరించడం, చేపలు పట్టడం, విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా చేపల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పడవలు, వలలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జాతీయ ఉత్తమ
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్) : జిల్లాలోని ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వచ్చే నెల 10వ తేదీలోపు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://nationalawrdstoteachers.ed ucation. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను విద్యాశా ఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,793 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు సకాలంలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


