నానాజీ దిగజారుడు వ్యాఖ్యలపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నానాజీ దిగజారుడు వ్యాఖ్యలపై ఆగ్రహం

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

పోలీసులకు ఫిర్యాదు చేసిన

వైఎస్సార్‌సీపీ నాయకులు

చిల్లకూరు: కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. గూడూరు సనత్‌ నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌, నాయకులు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై శిరీషాకు నానాజీపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న నానాజీ దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన నానాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, షేక్‌ సుభాన్‌, అన్నం మురళి, పూర్ణచంద్ర, జోగి వినోద్‌, కార్ల దీప్తి, బుజ్జా మాధవ్‌, సర్వేపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరిలో..

ఉదయగిరి: పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమైన నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు మోపి స్టేషన్లకు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. ఇసుక, మట్టి, విలువైన ఖనిజ సంపదను దోచేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టడం ఖాయమని, అప్పుడు తప్పు చేసిన అధికారులతోపాటు, టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో నేతలు పల్లాల కొండారెడ్డి, షేక్‌ అలీ అహ్మద్‌, దస్తగిరి అహ్మద్‌, ఏంఏ సలీమ్‌, దస్తగిరి అహ్మద్‌, అక్కి భాస్కర్‌రెడ్డి, ఆర్‌.శ్రీనివాసరెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మందలపు తిరుపతి నాయుడు, కాటం రవీంద్రరెడ్డి, ఇర్మియా, వై.ప్రభాకర్‌రెడ్డి, చెన్నరాయుడు, జక్కం శ్రీనివాసరెడ్డి, బాలగురువయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement