అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతల భరోసా | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతల భరోసా

Jun 29 2026 12:23 AM | Updated on Jun 29 2026 12:23 AM

కావలి: ఈ నెల 19న కావలి పట్టణం కచ్చేరిమిట్టకు చెందిన గిరిజన మహిళపై జరిగిన దారుణ ఘటనను తెలుసుకున్న కావలి వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం ఆమె నివాసానికి తరలివెళ్లారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో టీడీపీ నేత లు అమానుషానికి బరితెగించారని, ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. తాము అండగా ఉంటామని ఆమెకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయన్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు అదే ప్రాంతంలో ఉన్నటు గిరిజన మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్ర చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారన్నారు. ఈ విషయమై అదే రోజు కావలి 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోగా బాధితులను బెదిరించి రాజీ చేసుకోవాలని సూచించడంతో బాధిత మహిళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయంతో పది రోజులుగా అజ్ఞాతంలో ఉందన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు బాధితురాలిని బెదిరించేందుకు ఆమె పెట్టిన కేసు ను నమోదు చేస్తూ, ఆమె కుమారుడిపై నిందితురాల్లో ఒకరు స్నానం చేస్తుండగా పిట్ట గోడ ఎక్కి చూశారంటూ కేసు కూడా వారం తర్వాత ఈనెల 26వ తేదీన నమోదు చేయడంలోనే పోలీసుల వైఖరి తెలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పాలన నడుస్తుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఎస్‌కే రహంతుల్లా, పేరం వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు వెంకటేశ్వర్లు, కలికి శ్రీనివాసులురెడ్డి, ఎస్‌కే నాయబ్‌ రసూల్‌, పరసు మాల్యాద్రి. ద్రోణాదుల వెంకట్రావు ఆత్మకూరు శ్రీనుబాబు, వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, సీతారావమ్మ, దామెర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement