పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలి

Jun 29 2026 12:23 AM | Updated on Jun 29 2026 12:23 AM

కావలి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్న కాకినాడ రూరల్‌ ఎమ్మె ల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివారం కావలి వైఎస్సార్‌సీపీ నేతలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగతంగా అవమానించే పదజాలంలో కేవలం రాజకీయ లబ్ధికోసం దిగజారి మాట్లాడడం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వైఎస్సార్‌ కుటుంబం అభిమానులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే పంతం నానాజీతో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నటి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గుండ్లపల్లి మురళీ యాదవ్‌, మాల్యాద్రి, వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, పట్టణ మహిళ అధ్యక్షురాలు సీతారావమ్మ, సీనియర్‌ నాయకురాలు దామేర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, గూడ్లూరు మాల్యాద్రి, పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement