తహసీల్దార్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారని..

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు వివాదం

నెల్లూరు(అర్బన్‌): రొట్టెల పండగ జరిగే బారాషహీద్‌ దర్గా ఆవరణాన్ని ఆనుకుని నెల్లూరు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఉంది. తహసీల్దార్‌ కూడా దర్గా వద్ద విధుల్లో ఉన్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో ఓ సీఐ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని తహసీల్దార్‌ సుధీర్‌ ఆరోపించారు. ఈ మేరకు కార్యాలయ రెవెన్యూ సిబ్బంది మొత్తం ఆందోళన చేసేందుకు దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ఆర్డీఓ అనూష, ఏఎస్పీ అక్కడికి చేరుకుని పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దీంతో తహసీల్దార్‌కు సంబంధిత సీఐ క్షమాపణ చెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement