రొట్టెల పండగకు వస్తూ విషాదం | - | Sakshi
Sakshi News home page

రొట్టెల పండగకు వస్తూ విషాదం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

కారు అదుపుతప్పి యువకుడి మృతి

మరో వ్యక్తికి తీవ్రగాయాలు

మర్రిపాడు: అనంతపురానికి చెందిన నలుగురు మిత్రులు నెల్లూరు రొట్టెల పండగకు వస్తూ మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలోని శనివారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు బారాషహీద్‌ దర్గాలో జరిగే రొట్టెల పండగకు అనంతపురం నగరానికి చెందిన హరినాథ్‌, రఘునాథ్‌, నికిత్‌, సాయి(30) అనే స్నేహితులు కారులో బయలుదేరారు. చుంచులూరు వద్ద హైవేపై కారు డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవింగ్‌ చేస్తున్న సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రఘునాథ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరులోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement