బతకాలని లేదు.. చావనివ్వండి | - | Sakshi
Sakshi News home page

బతకాలని లేదు.. చావనివ్వండి

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

పురుగు మందు తాగబోయిన వ్యక్తి

సకాలంలో కాపాడిన పోలీసులు

సీతారామపురం: జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగబోయిన వ్యక్తిని పోలీసులు కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనమ మేరకు.. మండలంలోని బసినేనిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి సుబ్బారెడ్డి హైదరాబాద్‌లో రాపిడో డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన భార్యతో విభేదించి స్వగ్రామమైన బసినేనిపల్లికి వచ్చాడు. అప్పసముద్రం వైపు వెళ్లి నిర్జీవ ప్రదేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకుని చివరిసారిగా తన తండ్రి రఘురామిరెడ్డికి విషయం చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించగా స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సుబ్బారెడ్డి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ప్రత్యేక వాహనంలో దాసరిపల్లి హైవే సమీపాన వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న సుబ్బారెడ్డిని రక్షించారు. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement