ఆనందాల కుటుంబంలో పుట్టెడు శోకం | - | Sakshi
Sakshi News home page

ఆనందాల కుటుంబంలో పుట్టెడు శోకం

Jun 28 2026 7:18 AM | Updated on Jun 28 2026 7:18 AM

కొత్తకోడూరు బీచ్‌లో మునిగి

బాలుడి మృతి, బాలిక గల్లంతు

తోటపల్లిగూడూరు(పొదలకూరు): వారు ఎంతో ఆనందంతో నెల్లూరు రొట్టెల పండగకు వచ్చా రు. సముద్ర స్నానం చేద్దామని తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరు బీచ్‌కు వెళ్లారు. సరదాగా నీటి లో మునుగుతూ అలల తాకిడికి ఆనందించారు. అంతలోనే ఆ కుటుంబంలోని బాలుడు అలల తాకిడికి మృతిచెందగా మరో బాలిక గల్లంతు కాగా ఓ బాలికను రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా సోమల మండలం కందుకూరు గ్రామానికి చెందిన మహ్మద్‌ రఫీ కుటుంబం శనివారం రొట్టెల పండగకు వచ్చారు. నెల్లూరులో రొట్టెలను పట్టుకుని సరదగా సముద్ర స్నానం చేసేందుకు కొత్తకోడూరు బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తున్న మహ్మద్‌ సోఫియాన్‌(11), నఫీసా రుక్సానా, ముంతహిర సమీన్‌ అలల తాకిడికి గురయ్యారు. సోఫియాన్‌ మృతిచెందగా నఫిసా రుక్సాన గల్లంతయ్యారు. సమీన్‌ను అక్కడి వారు కాపాడారు. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రుక్సానా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి పోర్టు సీఐ రఘుబాబు, తోటపల్లిగూడూరు ఎస్సై వీరంద్రబాబు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనతో మహ్మద్‌ రఫీ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గల్లంతైన రుక్సానా కోసం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement