అంతా గోప్యం.. | - | Sakshi
Sakshi News home page

అంతా గోప్యం..

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

ఎస్‌ఐఆర్‌పై 11 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష

మీడియాకు నో ఎంట్రీ

నెల్లూరు(అర్బన్‌): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లతో ఇంటింటి సర్వే జరుగుతోంది. దీనిపై సమీక్షించేందుకు గానూ 11 జిల్లాల కలెక్టర్లు, ఎంపిక చేసిన బీఎల్వోలతో కలెక్టరేట్లో సమావేశాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు గురువారం చేపట్టారు. ప్రకాశం, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాలతో పాటు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషనర్‌ నవీన్‌కుమార్‌, రాష్ట్ర సీఈఓ వివేక్‌యాదవ్‌, కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు పాల్గొని.. ఇంటింటి సర్వేలో వస్తున్న ఇబ్బందులు, సమస్యలపై ఆరాతీశారు. విమర్శలు రాకుండా వాస్తవాలతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు సూచనలు చేశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం సర్వే వివరాలను డిజిటలైజ్‌ చేయాలని సూచించారు.

వివరాలను బయటకు పొక్కనీయకుండా..

ఎస్‌ఐఆర్‌ పేరుతో కొన్ని వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమీక్షలో వివరాలు బయటకు పొక్కకుండా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాకు సమాచారం లేకుండా సమావేశాన్ని గో ప్యంగా నిర్వహించారు. బీఎల్వోలందర్నీ పిలవకుండా ఎంపిక చేసిన అతి కొద్ది మందినే ఆహ్వానించి క్షేత్రస్థాయిలో జరుగు తున్న సర్వే తీరును సమీక్షించారు. వివరాలను మీ డియాకు ఇవ్వొద్దంటూ సమాచార, పౌరసంబంధా ల శాఖను ఆదేశించారు. తమకు ఓట్లేయని వారి పే ర్లను జాబితా నుంచి తొలగించేలా అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్‌ ద్వారా చేయిస్తున్నారంటూ ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ లాంటి వారు సభలు, సమావేశాల ద్వారా శాసీ్త్రయంగా ఆరోపిస్తున్నారు. సమావేశాలను రహస్యంగా జరపడాన్ని చూస్తే ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పారదర్శకంగా సమీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement