రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి మూలమూర్తి గురువారం చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలమూర్తికి ఎటువంటి ఆభరణాలు, పుష్పాలు లేకుండా చందనంతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు స్వామి నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి, ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం కావడంతో స్వామికి శాంతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని జరిపించారు. అనంతంరం కల్యాణాన్ని కనులపండువగా చేశారు. రాత్రి స్వామి బంగారు గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.


