జిల్లాలో ప్రతిపక్ష నేతలపై కొనసాగుతున్న కేసుల పరంపర చూస్తుంటే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ హక్కులకు పోలీసులు కొత్త నిర్వచనం రచిస్తున్నారనిపిస్తోంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపునకు పోలీస్ యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం చట్టాలను పక్కన పెట్టి.. ప్రతిపక్ష నేతలపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఒక నిరసనకు రెండు పోలీస్‌స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై కేసులు బనాయించడం ప్రతీకార రాజకీయం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక కేసులతో కట్టడి చేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వ పాలకుల అసహనం, అసమర్థతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


