నెల్లూరు(అర్బన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు గానూ జూలై ఒకటిన నిర్వహించనున్న డీ సెట్‌కు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకున్న 813 మంది అభ్యర్థులకు పరీక్షను పొట్టేపాళెంలోని అయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్‌ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్ కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. తమ అడ్మిట్ కార్డులను apdeecet. apcfss. in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాని కోరారు. వివరాలకు 94404 58428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


