సెలవుల వేళ.. విషాద ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

సెలవుల వేళ.. విషాద ప్రయాణం

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

డివైడర్‌ను ఢీకొన్న కారు

అందులో ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు

ముగ్గురికి తీవ్రగాయాలు

ఒకరి పరిస్థితి విషమం

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

కొడవలూరు: ఆ ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు. సెలవుల్ని సరదాగా గడుపుదామని కారులో బయలుదేరారు. అయితే ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొడవలూరు మండలం గండవరం ఫ్లయిఓవర్‌పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన శ్రీకంఠం, కార్తికేయ, సూళ్లూరుపేటకు చెందిన రుషికేష్‌ ఓంకార్‌, ఉరవకొండకు చెందిన సుశ్రిత, హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి పంజాబ్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. వారంతా స్నేహితులు. మూడో సంవత్సరం పూర్తవ్వడంతో సెలవులిచ్చారు. దీంతో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ బంధువులను కలుస్తూ ఆనందంగా గడపాలని కారులో బయలుదేరారు. సోమవారం నాటికి విజయవాడ చేరుకున్నారు. అక్కడ శ్రీకంఠం, కార్తికేయ ఇళ్లకు వెళ్లి సరదాగా గడిపి రాత్రి 8 గంటల ప్రాంతంలో సూళ్లూరుపేటకు బయలుదేరారు. అర్ధరాత్రి గండవరం ఫ్లయిఓవర్‌పై వేగంగా వస్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. కారు నడుపుతున్న రుషికేష్‌ ఓంకార్‌, ఇంకా సాకేత్‌రెడ్డి, శ్రీకంఠం తీవ్రంగా గాయపడ్డారు. సుశ్రిత, కార్తికేయ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి 108 అంబులెన్స్‌ ఈఎంటీ విజయ్‌, పైలట్‌ అబుబాకర్‌ అత్యవసర వైద్య సేవలందించి నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. సాకేత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఎస్సై సీహెచ్‌ కోటిరెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement