మద్యం మత్తులో హల్‌చల్‌.. యువకులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో హల్‌చల్‌.. యువకులకు రిమాండ్‌

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

ఆత్మకూరు: పట్టణంలో మద్యం మత్తులో కత్తితో హల్‌చల్‌ చేస్తూ ఓ కుటుంబాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్‌ విధించిందని సీఐ జీ గంగాధర్‌ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. మున్సిపల్‌ పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన వై ఆదర్శ్‌, ఏసీఎస్‌ఆర్‌కాలనీకి చెందిన కత్తి సుమంత్‌, ఎల్‌ఆర్‌పల్లి ప్రాంతానికి చెందిన భవాని గోవింద్‌, నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ సుహాన్‌బాబు సోమవారం సాయంత్రం మద్యం సేవించి 13వ వార్డులోని వెంకి అలియాస్‌ వెంకటేష్‌ ఇంటి వద్దకు వెళ్లి కత్తితో కుటుంబసభ్యులను బెదిరించారు. అనంతరం మద్యం షాపు వద్ద గొడవకు పాల్పడ్డారు. దీంతో యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించిందని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్సై జంపని కుమార్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement