ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Feb 26 2026 7:32 AM | Updated on Feb 26 2026 7:32 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ డిమాండ్‌ చేశారు. నెల్లూరు బాలాజీగర్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈనెలాఖరులో వరికోతలు ప్రారంభమవుతాయని, 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లోకి రాబోతోందన్నారు. ఈ వ్యవసాయ సీజన్‌లో రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయన్నారు. అన్నదాతలు వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో క్వింటా వరి ధాన్యానికి రూ.రూ.500 బోనస్‌ ఇస్తుండగా, కేరళలో రూ.630 ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బోనస్‌ ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, శివశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement