యద్దల నరేంద్రరెడ్డికి పితృవియోగం
గూడూరురూరల్: గూడూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సీనియర్ నేత యద్దల నరేంద్రరెడ్డి తండ్రి యద్దల వెంకటసుబ్బారెడ్డి అనారోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంకటసుబ్బారెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం మంగళపూరుకు శనివారం రాత్రి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేరిగ మురళీధర్ గ్రామానికి చేరుకుని వెంకటసుబ్బారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. యద్దల నరేంద్రరెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి వెంట గూడూరు నాయకులు కోడూరు మీరారెడ్డి, ఎంపీపీ బూదూరు గురవయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు సునీల్‌రెడ్డి, ప్రభాకర్‌రాజు, కొట్టు అశోక్, కందలి సర్పంచ్ బల్లి వెంకటేశ్వర్లు, సుబ్బానాయుడు, అట్ల శ్రీనివాసులురెడ్డి, చంద్రమోహన్ ఉన్నారు.


