డ్రస్ సర్కిల్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): నెల్లూరు నర్తకి సెంటర్‌లోని డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా ప్రవేశపెట్టిన ‘భలే చాన్సు బాసు’ బంపర్ లక్కీ డ్రా కారు విజేతగా ఎన్.దయాకర్‌రెడ్డి (కూపన్ నంబరు: 21038) నిలిచారు. ఇక్కడ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగిన వస్త్రాల కొనుగోళ్లపై లక్కీ డ్రా ఆఫర్స్‌లో భాగంగా శుక్రవారం బంపర్ డ్రా తీశారు. మొదటి బహుమతిగా కారును ఎన్.దయాకర్‌రెడ్డి గెలుచుకొని విజేతగా నిలిచారు. రెండో బహుమతిగా లాప్ టాప్, మూడో బహుమతిగా స్మార్ట్ ఫోన్‌ను అందజేశారు.


