బంగారు హారం అపహరణ
నెల్లూరు(క్రైమ్): బంగారు హారం, కొంత బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాకు చెందిన శంకర్ మండల్ ఉపాధి నిమిత్తం నెల్లూరుకు ఆరేళ్ల క్రితం వచ్చారు. కామాటివీధిలో నివాసం ఉంటూ ఇంట్లో బంగారు ఆభరణాలను తయారీ చేస్తున్నారు. ఈ తరుణంలో బంగారు హారాన్ని తయారు చేసివ్వాలంటూ ఆయనకు 70 గ్రాముల బంగారాన్ని అదే భవనంలో నివాసముంటున్న మగ్గన్‌రామ్ అందజేశారు. ఈ నేపథ్యంలో తన అసిస్టెంట్లు రోనిత్ మోస్సీ, రాకేశ్ బోల్‌తో కలిసి దీన్ని బుధవారం రాత్రి రూపొందించారు. ఆరేందుకు టేబుల్‌పై ఉంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రించారు. మరుసటి రోజు ఉదయానికి తలుపునకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. టేబుల్‌పై బంగారు హారం, కొంత బంగారు.. ఇలా 70 గ్రాములు కనిపించలేదు. దీంతో చోరీ ఘటనపై సంతపేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పొదలకూరు
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి: రూ.33
సన్నవి: రూ.20
పండ్లు: రూ.10


