రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేదరమెట్ల / నెల్లూరు సిటీ: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాళెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత జాఫర్ షరీఫ్ (జకీర్) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విజయవాడ వైపు నుంచి నెల్లూరు కారు వెళ్తోంది. ఈ క్రమంలో తిమ్మనపాళెం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా సిమెంట్ దిమ్మెను ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినింది. ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు మేదరమెట్ల పోలీసులు హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జకీర్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారని ఎస్సై మహ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారాయణ ఒంగోలులోని హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంతాపం
నెల్లూరు రూరల్: జకీర్ మృతి తనను తీవ్రంగా కలిచేసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం


