భోగి మంటల్లో పీపీపీ జీఓలు
నెల్లూరు రూరల్: పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను భోగి మంటల్లో వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దహనం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన కా ర్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణ మ్మ, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. నిత్యం అఘాయిత్యాలు, వేధింపులు జరుగుతున్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత సర్కార్ తీరుతో ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. అనంతరం వీరితో పాటు పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.


