రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో అంతులేని అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మకై ్క అక్రమ నిర | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో అంతులేని అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మకై ్క అక్రమ నిర

Nov 5 2025 8:11 AM | Updated on Nov 5 2025 8:11 AM

రాష్ట

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అవినీతి మత్తులో జోగుతోంది. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమై మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఓ రకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో మరో రకంగా పనులు చేస్తున్నారు. ఇరుకు రోడ్లలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ స్థలాలను విడిచి పెట్టడం లేదు. అనుమతులు తీసుకున్న దానికంటే అదనపు అంతస్తులు నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకునే వారే కరువయ్యారు.

అక్రమ కట్టడాలే.. అధికారులకు రాబడి

150 చ.కి.మీ. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. 1,83,643 నివాస భవనాలుండగా ఇందులో అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌ దాదాపు 8 వేలకు పైగా ఉన్నాయి. ఇక బహుళ అంతస్తుల భవనాలు దాదాపు 25 వేలకు పైగా ఉన్నాయి. నెలకు కనీసం 20 భవనాలకు ప్లాన్‌ అప్రూవల్‌కు దరఖాస్తులు కార్పొరేషన్‌కు వస్తున్నాయి. వీటిలో రోజుకు రెండూ లేదా మూడు భవన నిర్మాణాలకు అనుమతులిస్తుంటారు. భవన అనుమతుల ద్వారా కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం కంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు వచ్చే రాబడే అధికంగా ఉంటుంది. భవన నిర్మాణాలపై నిఘా ఉంచాల్సిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ముందుగానే తమ వాటాలు దండుకోవడంతో ఎక్కడా కూడా తనిఖీలు చేపడుతున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమ నిర్మాణ దారులు తమ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే వారి ఆదేశాల మేరకు నామమాత్రపు తనిఖీలు, చర్యలు చేపట్టి, సదరు అక్రమ నిర్మాణదారుల నుంచి అందిన కాడికి దండుకుని మిన్నకుండి పోతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు. ప్రధానంగా మాగుంటలేఅవుట్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అనేక భవనాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే కట్టడాలు చేసుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏం జరుగుతుందోనని పూర్తిస్థాయిలో పరిశీలిస్తే పలు విస్మయం కలిగించే అక్రమాలు, అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

అనుమతి తీసుకున్న దానికంటే మరికొన్ని అంతస్తులు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు డిమాండ్‌ చేస్తే ఇంకా మనకు మరింత డబ్బులు వస్తాయి కదా

టౌన్‌ ప్లానింగ్‌

అనుమతులు

అక్రమ కట్టడాలకు ‘అవినీతి’ చేవ్రాలు

కాసుల వేటలో పట్టణ ప్రణాళికా విభాగం

నిబంధనలు పాటించని

భవన యజమానులు

యథేచ్ఛగా కొనసాగుతున్న

అక్రమ నిర్మాణాలు

కార్పొరేషన్‌ ఆదాయానికి గండి

జేబులు నింపుకొంటున్న ప్లానింగ్‌ సెక్రటరీలు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం1
1/3

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం2
2/3

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం3
3/3

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement