తండ్రిని వెతుక్కుంటూ.. | - | Sakshi
Sakshi News home page

తండ్రిని వెతుక్కుంటూ..

Jul 30 2025 6:46 AM | Updated on Jul 30 2025 6:46 AM

తండ్ర

తండ్రిని వెతుక్కుంటూ..

మనుబోలు: ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి బయలుదేరి తప్పిపోయిన తన తండ్రిని వెతుక్కుంటూ కుమార్తె తన భర్తతో కలిసి రాష్ట్రాలు దాటి మంగళవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. అసోం రాష్ట్రానికి చెందిన దింభేశ్వరి స్విర్గియారి అనే 50 ఏళ్ల వయసున్న వ్యక్తి రైల్లో బెంగళూరుకు బయలుదేరాడు. 23వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగాడు. అయితే తిరిగి రైలు ఎక్కలేకపోయాడు. దీంతో అక్కడి నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బెంగళూరుకు బయలుదేరాడు. మనుబోలు వద్ద వేకువజామున కాలకృత్యాల కోసం బస్సు ఆపగా దిగాడు. తిరిగి ఎక్కకపోవడంతో సిబ్బంది అతడి బ్యాగు, అందులో ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమార్తె సోనియా, అల్లుడు సుబ్బు మనుబోలుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుర్తుతెలియని

వాహనం ఢీకొని..

వ్యక్తి మృతి

దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథ నం మేరకు.. మారు పూడి భాస్కర్‌ (45) దగదర్తి వాసి. సోమ వారం రాత్రి నెల్లూరు నుంచి తన స్వగ్రామమైన దగదర్తికి బైక్‌పై వస్తున్నాడు. సున్నపుబట్టి జామాయిల్‌ చెట్ల వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. భారీ వాహనాలు శరీరంపై దూసుకెళ్లడంతో ఛిద్రంగా మారింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భాస్కర్‌ బోగోలు మండలం నాగులవరం సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ సస్పెండ్‌ అయ్యాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్‌ మంగళవారం తెలిపారు.

కేసుల పేరుతో భయపెట్టి

రూ.15 లక్షల దోపిడీ

నెల్లూరు(క్రైమ్‌): సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తిని కేసుల పేరుతో బెదిరించి నగదు దోచుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నెల్లూరు నగరానికి చెందిన ఆంజనేయులు గాంధీబొమ్మ వద్ద దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 26వ తేదీన గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తన పేరు గౌరవ సారథి అని, బెంగళూరు పోలీస్‌ శాఖ నుంచి మాట్లాడుతున్నాని చెప్పాడు. మీపై మహిళలను వేధిస్తున్న కేసు, సీఐడీలో మరో కేసు నమోదైందన్నాడు. ఈ రెండు కేసులను నిలుపుదల చేయాలంటే రూ.15 లక్షలు తాను చెప్పిన బ్యాంక్‌ ఖాతాకు పంపాలని సారథి సూచించాడు. దీంతో దుకాణదారుడు ఆ ఖాతాకు రూ.15 లక్షలు పంపించగా మరికొంత నగదు కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దుకాణదారుడు మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎకరాకు రూ.5 లక్షల పరిహారమివ్వాలి

సైదాపురం: స్థానిక పంచాయతీలోని కమ్మవారిపల్లెలో నిమ్మతోటల రైతులకు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.సుబ్బరాయుడు పేర్కొన్నారు. తొలగించిన నిమ్మతోటలను రైతు కూలీ సంఘం ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులు తురకా మస్తాన్‌, శశికుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నిమ్మచెట్లను జేసీబీలతో తొలగించడం దారుణమన్నారు. 8 నెలలుగా మైనింగ్‌ మాఫియాతో ప్రభుత్వం కుమ్మకై ్క ఎస్సీ, ఎస్టీ, బీసీలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

కండలేరులో

26.792 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 26.792 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,873, పిన్నేరు కాలువకు 20, లోలెవల్‌ కాలువకు 70, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

తండ్రిని వెతుక్కుంటూ..1
1/2

తండ్రిని వెతుక్కుంటూ..

తండ్రిని వెతుక్కుంటూ..2
2/2

తండ్రిని వెతుక్కుంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement