
బైక్‌ల దొంగ అరెస్‌్ట
నెల్లూరు(క్రైమ్): బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు బుధవారం నిందితుని వివరాలను వెల్లడించారు. ఇటీవల తమ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు బైక్ దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడు బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన పీట్ల వంశీగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారించగా బైక్‌లను దొంగలించినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.2.50 లక్షలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీ నం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు విజయకుమార్, నవీన్, పీఎస్సై యు.సాయికల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.