184 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

184 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Apr 6 2025 12:13 AM | Updated on Apr 6 2025 12:13 AM

184 క

184 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

జలదంకి: మండలంలోని ఎల్‌ఆర్‌అగ్రహారం రోడ్డులో ఉన్న గోకులకృష్ణ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 184 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సివిల్‌ సప్లయీస్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. రైస్‌మిల్లులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు సమాచారంతో శనివారం కావలి సివిల్‌ సప్లయీస్‌ ఏఎస్‌ఓ రవి, జలదంకి డీటీ జూలీబాయ్‌, జలదంకి, గోపన్నపాళెం వీఆర్వోలు గిరిధర్‌రెడ్డి, మాలకొండయ్య రైస్‌మిల్లును తనిఖీ చేశారు. 184.25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్‌ విలువ రూ.6,60,962గా గుర్తించారు. మిల్లు యజమాని నిమ్మకాయల వెంకటేశ్వర్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఓ రవి తెలిపారు. ఈ బియ్యాన్ని కావలిలోని ప్రభుత్వ గోడౌన్‌కు తరలించినట్లు తెలిపారు.

ఎంఈఓ సస్పెన్షన్‌

ఉలవపాడు: విధి నిర్వహణలో మద్యం తాగుతూ.. ఆ మత్తులో ఉంటున్న ఉలవపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈఓ కల్లూరి శివనాగేశ్వరరావును ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూల్‌ ఆట స్థలంలో మద్యం మత్తులో తూగుతున్న ఎంఈఓపై సాక్షిలో ‘ఆయన మారలేదు’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ ఆనంద్‌ విద్యాశాఖను నివేదిక కోరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓ సస్పెన్షన్‌ ఉత్తర్వులు నోటీస్‌ బోర్డులో ఉంచాలని డీఈఓ, డిప్యూటీ డీఈఓతోపాటు ఎంఈఓ–2 రమణయ్యను ఆదేశించారు.

జింకను వేటాడిన

వ్యక్తిపై కేసు నమోదు

నెల్లూరు (అర్బన్‌): ఆమంచర్ల సెక్షన్‌ కసుమూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో జింకను వేటాడిన ఓ వ్యక్తిని ఫారెస్ట్‌ అధికారులు శనివారం మాంసంతో సహా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. వెంకటాచలం మండలం వెంకటకృష్ణాపురం (వడ్డిపాళెం)కు చెందిన చల్లా కృష్ణయ్య అడవిలో జింకను వేటాడి మాంసాన్ని బాక్స్‌లో పెట్టుకుని వెళుతున్నట్లు స మాచారం అందుకున్న నెల్లూరు ఫారెస్ట్‌ రేంజర్‌ మాల్యాద్రి, సిబ్బంది తనిఖీ చేసి పట్టుకున్నారు. నిందితుడిని వేదాయపాళెంలోని జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయానికి తీసుకు వచ్చారు. పరిశీలించిన డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా మాట్లా డుతూ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కృష్ణయ్యపై కేసు నమోదు చేశామని తెలిపారు.

‘రంగడి’ సన్నిధిలో నేడు

సీతారాముల కల్యాణం

నెల్లూరు (బృందావనం): రంగనాయకులపేటలో ని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం జరుగుతుందని ఈఓ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి, సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి తిరుమంజనం, 10.30 గంటలకు శ్రీరామ అవతార ఘట్టపురాణ పఠనం, సాయంత్రం 6.30 గంటలకు తల్పగిరి రంగనాథస్వామి వారికి హనుమంత సేవ పేట ఉత్సవం జరగనున్నాయని తెలిపారు.

184 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత 
1
1/1

184 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement