సాకులు చెబుదాం.. తప్పించుకుందాం.. | - | Sakshi
Sakshi News home page

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం..

Apr 3 2025 12:24 AM | Updated on Apr 3 2025 12:24 AM

సాకుల

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం..

బాధ్యతగా..

నేటి నుంచి

‘పది’ మూల్యాంకనం

మొగ్గు చూపని కొందరు అయ్యోర్లు

ఆరోగ్య కారణాలు చూపి ఎగనామం

ఎగ్గొటేందుకు సంఘాలు,

పలువురితో సిఫార్సు

కేంద్రంలోకి సెల్‌ఫోన్ల నిషేధం

నిధులు విడుదల చేయని ప్రభుత్వం

నెల్లూరు(టౌన్‌): పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ హైస్కూళ్లలో జరుగుతుంది. 36 గదులను సిద్ధం చేశారు. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు 1,92,920 జవాబుపత్రాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 1,036 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 174 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 348 మంది స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. మూల్యాంకనం చేసిన ఓఎంఆర్‌ షీట్లను ఏరోజుకారోజు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపనున్నారు. సమగ్రశిక్ష రాష్ట్ర అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర పరిశీలకుడిగా, డీఈఓ బాలాజీరావు క్యాంప్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను అందజేస్తారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా దానిని ధరించాల్సి ఉంది.

డీఈఓపై ఒత్తిళ్లు

పదో తరగతి మూల్యాంకనానికి హాజరయ్యేందుకు కొందరు ఉపాధ్యాయులు ముఖం చాటేస్తున్నారు. ఈ పని నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకునేందుకు రకరకాల పాట్లు పడుతున్నారు. పలువురు ఆరోగ్య కారణాలను సాకుగా చూనెతున్నారు. మరికొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లా స్థాయి అధికారుల ద్వారా డీఈఓ బాలాజీరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారింది. మూల్యాంకనానికి ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో హాజరు వేయాలని నిబంధన పెట్టడం, రోజూ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వహించాల్సి రావడం, పైగా సెల్‌ఫోన్లను కేంద్రంలోకి నిషేధించడంతో ఎక్కువ మంది టీచర్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. మూల్యాకనం కోసం నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయలేదని సమాచారం. సొంత ఖర్చులతోనే ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని జిల్లా విద్యాశాఖాధికారులు మదన పడుతున్న పరిస్థితి ఉంది.

జిల్లాకు చేరిన జవాబుపత్రాలు : 1,92,920

అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు :

1,076 మంది

సీఈలు :

174 మంది

ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ రోజుకు 40 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. వాటిని చీఫ్‌ ఎగ్జామినర్‌ పరిశీలిస్తారు. తర్వాత స్పెషల్‌ ఆఫీసర్‌ చెక్‌ చేస్తారు. ఒక్కో పేపర్‌ మూల్యాంకనం చేసినందుకు రూ.10లు ఇస్తారు. జవాబుపత్రాలను ఎలాంటి తప్పులేకుండా బాధ్యతాయుతంగా దిద్దాల్సి ఉంటుంది. పని ఒత్తిడి, తొందరపాటు, నిర్లక్ష్యం తదితర కారణాలతో మూల్యాంకనంలో తప్పులు దొర్లుతుంటాయి. విద్యార్థి రీ వెరిఫికేషన్‌ పెట్టినప్పుడు పేపర్‌ సరిగా దిద్దలేదని, మార్కులు తప్పుగా కౌంటింగ్‌ చేసినట్లు తేలితే సంబంధిత ఉపాధ్యాయుడిపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనానికి వచ్చేందుకు కొందరు టీచర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాల నాయకులు సిఫార్సు చేసిన వారిని మూల్యాంకన విధుల నుంచి తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మినహాయింపు లేదు

పది జవాబుపత్రాల మూల్యాంకనానికి డ్యూటీ వేసిన ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాల్సిందే. ఎవరికీ మినహాయింపు లేదు. విధులకు వచ్చిన వారు ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. మూల్యాంకన సమయంలో ఎవరూ సెల్‌ఫోన్‌ను వినియోగించకూడదు. తప్పులు లేకుండా, టెన్షన్‌ పడకుండా ప్రశాంత వాతావరణంలో జవాబుపత్రాలను దిద్దాలి.

– ఆర్‌.బాలాజీరావు, డీఈఓ

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం.. 1
1/2

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం..

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం.. 2
2/2

సాకులు చెబుదాం.. తప్పించుకుందాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement