బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే | Zimbabwe crush Bangladesh by innings and 85 runs to seal biggest-ever Test win | Sakshi
Sakshi News home page

ZIM vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే!

Jun 30 2026 7:39 PM | Updated on Jun 30 2026 8:13 PM

Zimbabwe crush Bangladesh by innings and 85 runs to seal biggest-ever Test win

టెస్ట్ క్రికెట్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న బంగ్లాదేశ్‌కు ప‌సికూన జింబాబ్వే భారీ షాకిచ్చింది. హరారే వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా జింబాబ్వేకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. యువ పేసర్ న్యూమన్ న్యాముహురి నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. కెప్టెన్ నగరవా, బ్రాడ్ ఎవన్స్‌, ముజుర్‌బానీ తలా రెండు వికెట్లు సాధించారు. 

బంగ్లా బ్యాటర్లలో మోమినల్ హక్‌(60) ఒక్కడే రాణించాడు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ ఇన్నోసెంట్ కాయా (140) భారీ సెంచరీతో కదం తొక్కాడు. బ్రియాన్‌ బెన్నట్‌(60), మాధవీరే(77), ఎర్విన్‌(60) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

బంగ్లా బౌలర్లలో స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం 7 వికెట్లతో సత్తాచాటాడు. ఆ తర్వాత 270 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన 185 పరుగులకే ఆలౌటైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. 

జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బానీ 4, రిచర్డ్ నగరవా 3 వికెట్లు పడగొట్టారు. జింబాబ్వే వారి టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఇది మూడోసారి గమనార్హం. జింబాబ్వే గత టెస్టులో (అక్టోబర్ 2025) అఫ్గానిస్తాన్ విజయం సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement