'పంత్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు'

Wriddhiman Saha Says No Conflicts And Rivalries With Rishab Pant  - Sakshi

ముంబై:  టీమిండియా వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తన సహచర ఆటగాడు రిషబ్‌ పంత్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌ పర్యటనలో రిషబ్‌ గొప్ప ప్రదర్శన చేసినప్పటికి తన కెరీర్‌కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్నాడు. 'పంత్‌కు,నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.. కావాలంటే అ విషయంపై మీరు అతన్ని అడగొచ్చు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. ఎవరు బాధపడం.. పైగా ఒకరినొకరు సాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగానూ నాకు పంత్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరిలో నెంబర్‌ 1,2 అంటూ ఎవరు లేరు. బ్యాటింగ్‌లో ఎవరిశైలి వారికి ఉంటుంది. మ్యాచ్‌లో ఉత్తమంగా రాణించినవారికి జట్టు అవకాశాలిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళుతా.. అంతేగాని జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో ఉండదు. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పంత్‌ కీపింగ్‌లోనూ క్రమంగా మెరుగవుతున్నాడు.


మొదటి తరగతిలోనే అన్ని నేర్చుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది.. పంత్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏదో ఒకరోజు ఉన్నతస్థాయికి ఎదుగుతాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తోనే రిషబ్‌ పంత్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనితో పోలుస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్‌ కాదు. ఎవరి వ్యక్తిగత గుర్తింపు వారికి ఉంటుంది. ఇక రహానే కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సిరీస్‌లో మేం సాధించిన విజయం ప్రపంచకప్‌ గెలిచినంత సమానం. రహానే కెప్టెన్సీ చాలా కూల్‌గా ఉంటుంది. కోహ్లి లాగే అతను ఆటగాళ్లను బాగా నమ్ముతాడు.. భావోద్వేగాలను బయటపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. సహచరుల్లో స్పూర్తి ఎలా నింపాలో రహానేకు బాగా తెలుసు.. అతని విజయరహస్యం కూడా ఇదే అంటూ  చెప్పుకొచ్చాడు. చదవండి: థ్యాంక్యూ యువీ భయ్యా.. ఇదంతా నీ వల్లే


ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విఫలం తర్వాత మిగతా మూడు టెస్టులకు అవకాశం రాకపోవడంపై సాహా స్పందించాడు. ఎవరి కెరీర్‌లోనైనా ఫెయిల్యూర్‌ అనే దశ కచ్చితంగా ఉంటుంది. కెరీర్‌లో ముందుకు సాగాలంటే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొవడం తప్పనిసరి.. నేను గాయపడడంతోనే కదా.. రిషబ్‌ పంత్‌ ప్రతిభ ఎంత అనేది భయపడింది. అంతమాత్రానా నా కెరీర్‌ ముగిసిపోతుందని నేను అనుకోనని తెలిపాడు. చదవండి: ఐపీఎల్‌: రిటైన్‌ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top