World Boxing Championships: Nishant Dev enters Pre-quarters with Statement Victory - Sakshi
Sakshi News home page

బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ సంచలనం

May 4 2023 11:47 AM | Updated on May 4 2023 12:05 PM

World Boxing Championship: Nishant Dev enters Pre Quarters - Sakshi

నిశాంత్‌ దేవ్‌

తాష్కెంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన 71 కేజీల తొలి రౌండ్‌ బౌట్‌లో నిశాంత్‌ దేవ్‌ 5–0తో సర్ఖాన్‌ అలియెవ్‌ (అజర్‌బైజాన్‌)పై గెలుపొందాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిశాంత్‌ దేవ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఇదే టోర్నీలో అలియెవ్‌ కాంస్య పతకం సాధించాడు. 

Madrid Open:: ప్రపంచ నంబర్‌వన్‌ జోడీకి బోపన్న ద్వయం షాక్‌ 
రెండు నెలల వ్యవధిలో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్‌ జోడీని బోల్తా కొట్టిస్తూ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) ద్వయం మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 6–3, 6–2తో ప్రపంచ నంబర్‌వన్‌ వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) ద్వయంపై గెలిచింది. మార్చిలో ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ ఫైనల్లో కూలాఫ్‌–స్కప్‌స్కీ జంటను ఓడించి బోపన్న ద్వయం విజేతగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement