ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ముర్రేకు వైల్డ్‌ కార్డు 

Wild Card For Andy Murray At The French Open - Sakshi

పారిస్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రేకు ఈ నెల 27న మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేందుకు నిర్వాహకులు వైల్డ్‌ కార్డు కేటాయించారు. నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడేందుకు తగిన ర్యాంక్‌ లేకపోవడంతో ముర్రే గత ఘనతలను లెక్కలోనికి తీసుకొని (2016లో రన్నరప్‌) ఈ అవకాశం ఇచ్చారు. గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరం కావడంతో ముర్రే ర్యాంక్‌ 129కి పడిపోయింది. యూఎస్‌ ఓపెన్‌లోనూ ముర్రే వైల్డ్‌ కార్డుతోనే ఆడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top