WI vs IRE: 4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ..

 West Indies Beat Ireland In 1st ODI - Sakshi

కింగ్‌స్టన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌1-0తో అధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఆదిలోనే జస్టిన్ గ్రీవ్స్ వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ షాయ్ హోప్, నికోలస్ పూరన్ వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ సెకెండ్‌ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 4 పరుగల వ్యవధిలోనే విండీస్‌ మూడు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్‌ పొలార్డ్‌,  బ్రూక్స్  వెస్టిండీస్‌ను అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో విండీస్‌ 269 పరుగులకు ఆలౌటైంది.  విండీస్‌ బ్యాటర్లలో బ్రూక్స్ 93 పరుగులు చేయగా, పొలార్డ్‌ 69 పరుగులు సాధించాడు. ఐర్లాండ్‌ బౌలరల్లో మార్క్‌ అదైర్‌, క్రెగ్‌ యంగ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఆదిలోనే ఒపెనర్‌ విలియం ఫోర్ట్‌ ఫీల్డ్‌ వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్‌  బాల్బిర్నీ, ఆండీ మెక్‌బ్రైన్ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ సమయంలో మంచి ఊపు మీద ఉన్న మెక్‌బ్రైన్ రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం​ క్రీజులోకి వచ్చిన టెక్టర్ కూడా అద్భుతంగా ఆడాడు. బాల్బిర్నీ, టెక్టర్‌ కలిసి 103 పరుగుల భాగస్తామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో  బాల్బిర్నీ,  టెక్టర్‌ వికెట్లను ఐర్లాండ్‌ వరుస క్రమంలో కోల్పోయింది. అనంతరం ఐరీష్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 49.1ఓవర్లలో ఐర్లాండ్‌ 245 పరుగులకు ఆలౌటైంది. ఐరీష్‌ బ్యాటర్లలో  బాల్బిర్నీ(71), టెక్టర్‌(53) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. విండీస్‌ బౌలర్లలో షెపర్డ్, జోషప్‌ చెరో మూడు వికెట్లు సాధించారు. 

చదవండి: Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్‌రెడీ పెళ్లైన టెన్నిస్‌ స్టార్‌తో నటి వివాహం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top