సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!

Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు.
"Tiger hunts every 4-7 days".
Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz— Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్‌లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్‌ను ఆస్వాధిస్తున్నారు.
కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్‌లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు