Ind vs SL 3rd Odi: Virat Kohli Smashes 74th Century - Sakshi
Sakshi News home page

IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి

Jan 15 2023 4:57 PM | Updated on Jan 15 2023 6:02 PM

IND vs SL 3rd ODi: Virat Kohli smashes 74th CENTURY - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మరో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు.  ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది రెండో సెంచరీ. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కింగ్‌ కోహ్లి అద్భుతమైన శతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం విశేషం. అదే విధంగా వన్డేల్లో విరాట్‌కు ఇది 46 సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. రవీంద్ర జడేజా కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement